| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 044. వీరుడు |
| 44. వీరుడు |
| వీరుడెవడురా శూరు డెవడురా! ఘోరమైన యుద్ధభూమి మాఱుమ్రోగు ఫిరంగీల బారులకును వెఱవకుండ బోరు సైనికుండేనా? |
| ఉసురుల విసికించి జగతి మసలకుండజేయు క్రూర వ్యసనమ్ములతోడ బోరి వశము గొనినవాడు కాడొ? వీరు... |
| శక్తియెద్దిరా? వ్యక్తి యెద్దిరా? కొండలన్ని పిండికొట్టి మండు మహాగ్నుల జొరబడి దండిశక్తి జూపి వెలుగు గండరగండ గుటేనా? |
| అన్నమాట నెగ్గింపగ నెన్ని కట్టడిడుములైన వెన్నుజూపకుండ కోరి కొన్న ధీరు డగుట కాదొ? శక్తి... |
| రక్తి యెద్దిరా? ముక్తి యెద్దిరా? పాడుమబ్బు సంచులతో కూడబెట్టి యనుభవింప జూడలేక ప్రాణమైన వీడెడు దురవస్థ యేన? |
| మనసు గొన్న కన్నియకై ధనము ప్రాణమైన నిచ్చి ప్రణవపు నిర్వాణమ్మున తనివి గొనుట గాకనెద్ది? రక్తి... |
| వీరు డెవడురా! శూరుడెవడురా! |