| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 043. నాట్యసుందరి |
| 43. నాట్యసుందరి |
| ఆడవె, ఆడవె అన్నులమిన్నా ఆడవె లేనడు మల్లలనాడన్ |
| ఆడెడు నీ నడుమందము గాంచిన నల్లాడవె ప్రేమను లోకంబుల్? ఆడవె... |
| పాడవె, పాడవె భామామణిరో పాటలాధరము బాగులు గుల్కక |
| వలపు జిల్కు నీ పాటలు విన్నన్ పరవశగాదే ప్రకృతి యెల్లన్? పాడవె... |
| చూడవె, చూడవె సుందరవదనా! సోగకన్నులన్ సోలగ ప్రేమము |
| సొంపు గుల్కు నిన్ జూచినంతనే చుక్కలు సైతము సోలవె ప్రేమన్? చూడవె... |