| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 042. ఐక్యమౌదామె? |
| 42. ఐక్యమౌదామె? |
| ఆ మబ్బు యీ మబ్బు ఆకాశ మధ్యాన అద్దుకున్నట్లు మన మైక్య మౌదామె? |
| ఆ తీగె యీ తీగె అడివి పొదరింటిలో అల్లుకున్నట్లు మన మైక్య మౌదామె? |
| ఆ వాగు యీ వాగు అడ్డాల కోనలో యేకమైనట్లు మన మైక్య మౌదామె? |
| ఆ మాట యీ మాట అర్థాంతరములోన వాక్యమైనట్లు మన మైక్యమౌదామె? |