| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 041. ఎదికావలెనే? |
| 41. ఎదికావలెనే? |
| ఇది సంపెగ పూ విది మల్లెపూవు ఎది కావలెనే? చెలియా! |
| ఇది మామిడిపం డిది జామపండు ఎది కావలెనే? చెలియా! |
| ఇది ద్రాక్షరస మిది పూవుదేనె ఎది కావలెనే? చెలియా! |
| ఇది వైడూర్యం బిది మేలికెంపు ఎది కావలెనే? చెలియా! |
| ఇది కృష్ణప్రేమ మిది మిత్రుప్రణయ మెది కావలెనే? చెలియా! |