| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 040. భావిచింతనము |
| 40. భావిచింతనము |
| కాలచక్రము గతిగడచి, ప్రపంచ భావిభాగ్య మ్మెల్ల పండినవెనుక నానాటికెవరైన నడుగకపోరు 'శ్రీకృష్ణు డెవ్వరు చెప్పుమా' యంచు భాగ్యవశమ్మున భావికాలాన నమృతతుల్యములు జీవితభారనమ్ర ములు నైన నాగీతములు విని రాధ ప్రేమ మగాధ మం చెఱుగకపోరు. |