| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 039. మురళీకృష్ణుడు |
| 39. మురళీకృష్ణుడు |
| హృదయములు రెండు ప్రేమచే నేకమైన లీల శ్రుతిలోన వేణువు లీనమయ్యె విశ్వమెల్లను నిండిన ప్రేమరాగ మట్లు నీరాగ మెల్లర నావహించె. |
| ఒక్కపరి కోకిలమ్మటు లొక్కసారి గరుడ గంధర్వ కిన్నరీ గానఫణితి బాలపవనుడు పూల నుయ్యాల లూపు నట్ల నీపాట మమునూపె, నౌర, కృష్ణ! |
| పవను కౌగిలి జొచ్చిన పల్లవమ్ము లట్టులను నాలిచింతల నన్ని మరచి భవ దమృత వేణుగానాతి పారవశ్య మున నచేతను లటులైతిమోయి కృష్ణ! |