| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 038. మురళీకృష్ణుడు |
| 38. మురళీకృష్ణుడు |
| వాయింపుమా మురళి వాయింపు కృష్ణ! తుమ్మెదగండ్లు జుంజుమ్మని పాడు శారదరమణియు సంద్రంపురాజు నానందమున నోలలాడుచున్నారు |
| వాయింపుమా మురళి వాయింపు కృష్ణ! వాయింపుమా మురళి స్వచ్ఛముగ కృష్ణ! |
| పండ్లు పైరులు మిగుల బండియున్నవవె రతిరాజు లోకసామ్రాజ్యమ్ము నేలు నీవేళ చింతల కెడ మేడదోయి! |
| స్వచ్ఛమ్ముగా మురళి వాయింపు కృష్ణ! వాయింపుమా మురళి వాయింపు కృష్ణ! |