| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 147. జీవితరహస్యము |
| 147. జీవితరహస్యము |
| ఈ జీవితమ్మున కేమర్థ మోయి నామనోహర, ప్రియా! నారాజ! చెపుమ, శరదంపు సూర్యునికిరణాలు నీదు బంగారుశిరముపై బర్వియుండంగ. |
| చాందీతళుక్కుల సంజల నీదు విమలస్వరం బిట్లు వినుపించుచుండ మనుజుల కనుబ్రామి మాయమై చనిన ప్రకృతిదౌ పరమరాహస్యమ్మదేమి? |