| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 146. ప్రణయ పారవశ్యము |
| 146. ప్రణయ పారవశ్యము |
| సరుకుచెట్లను గాలి చల్లగా వీచె వినతయై యొడ్డుకుం జనియె కెరటమ్ము నల్లనౌ నింగిపై నక్షత్రమొండు తేజరిల్లెను గొప్పదీపంబువోలె కర్ణమ్ము జొరదయ్యె కడలిశబ్దమ్ము శూన్యమ్ములై తోచె చుక్కలుం గాలి బంగారు నీ కురుల బావుటా నాదు వక్షస్థలమ్ముపై బర్వియుండంగ. |