| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 096. కడుపుతీపి |
| 96. కడుపుతీపి |
| ఆకసమ్ము చిల్లిపడ్డ యట్లు వర్ష మేకధార కుండపోత బోసి కొట్టి కుమ్మరించి దిమ్మరించె క్రూరపు నీకాళరాత్రి ఘోరమైన రుద్రభూమి దల్లీ! నా మంగళప్ర దా! తడియుచు వడకుచుంటె? |
| ప్రణయసామ్రాజ్యపట్ట భద్రుడవై నిద్రాళుల పరమ కృపా పూర్ణదృష్టి బాలించెడు పరమేశా! |
| రుద్రభూమి నేకాకిగ నిద్రించెడు మమ్ముగన్న మంగళప్రదను నిద్రా భంగ మొదవకుండ గాచి కరుణామృతధారల నాఁ కలిదప్పుల బాధదీర్చి చల్లనైన జోలపాడి మెల్ల మెల్ల జోకొట్టుమ! |
| ఈసాయము జేయుము నీ ఋణము దీర్చికొందుమయ్య ఈ జన్మను గాకున్నను నింకొక జన్మముననైన! |