| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 097. చలిపిడుగు |
| 97. చలిపిడుగు |
| ప్రలయాంతాభీలనభో దళన ఫెళ ఫెళారవముల జలిపిడుగా! గర్జింపకు నిలిచి నాదు మనవి వినుము |
| బంగారపుబొమ్మ నాదు మంగళప్రదమ్మ యొంటి రుద్రభూమి గటికనేల నిద్రించెడు నొడలుమరచి |
| చూపబోకు మచట నీప్ర తాపమెల్ల పిడుగా! నా కన్నతల్లి యడిలి లేచి కక్కటిల్లి యేడ్వగలదు! |
| కడుపుమంట గనలిపొక్కు కన్నతండ్రి నైననాదు పలువరింత మాటలకును నలుక బూన కయ్య మదిని! |
| ప్రళయాంతాభీలనభో దళన ఫెళ ఫెళా రవముల చలిపిడుగా! గర్జింపకు నిలిచి నాదుమనవి వినుము! |