| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 107. కయ్యాల విందు |
| 107. కయ్యాల విందు |
| గయ్యాళి పెళ్ళాన్ని కట్టుకుంటేను కయ్యాల కెన్నటికి కరువులేదండి! |
| కయ్యాలతో మేడ కట్టించుతాము, వియ్యాలవారి కది విడిది కిస్తాము! |
| కయ్యాలతో వంట కాలు వండేము బంతులలో కవే వడ్డించుతాము! |
| కయ్యాలె అల్లుడికి కట్నమిస్తాము! చుట్టపాతల కవే చుట్ట పెడతాము! |