| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 108. ప్రణయ కలహము |
| 108. ప్రణయ కలహము |
| రొంయి రొయ్యని పాడుతుమ్మెదా నీవు కయ్యాలు వద్దనీ తుమ్మెదా! |
| ఆలిమొగులసందు కయ్యం తుమ్మెదా నున్న నద్దంమీద పెసరగింజ తుమ్మెదా! |
| వెయ్యి తేనెబొట్లు బోస్తా తుమ్మెదా చిట్టి కయ్యాలు మానిపిస్తె తుమ్మెదా! |