| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 109. క్రాస్ పరీక్ష |
| 109. క్రాస్పరీక్ష |
| ఈవు కనుబొమ లిటె చిట్లించగానె తనువు కంపిల్లి గుండెలు తల్ల డిల్లి 'వాకుధోరణి' గల న్యాయవాది నయ్యు మొదటిమాటలోనే తెల్లమొగమువేతు. |
| మధురమధుయామినీపీఠ మధివసించి చల్ల చూపుల జడ్జి మా చందురుండె నవ్వె తనపర్వు బుగ్గయినట్లు కొంటె రిక్క ప్లీడర్లు నను జూచి పక్కుమనిరి. |