| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 180. మాలమాదిగల మొఱ |
| 180. మాలమాదిగల మొఱ |
| గాంధీమహాత్మ, గాంధీమహాత్మ, కాచి రచ్చించు గాంధీమహాత్మ. |
| సరకారువోరు, కరుకైనవోరు ఉప్పేరితేను తప్పేశినోరు గాంధీ... |
| డబ్బుగలోరు దరికి రానీరు ఈగోర మేమి మానేర మేమి? గాంధీ... |
| మాలమాదిగలం, మనుసులం గామా? కుక్కలకన్నా తక్కువయ్యామా గాంధీ.... |
| మామొఱాలించ సామోరె దిక్కు ఆసామివోరి అవుతారమైన |
| గాంధీమహాత్మ, గాంధీమహాత్మ, కాచి రచ్చించు గాంధీమహాత్మ. |