| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 179. గాంధీప్రభ |
| 179. గాంధీప్రభ |
| గాంధిమహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తూ, కలకల నవ్విందీ గాంధి... |
| గాంధిమహాత్ముడు చకచక నడువగ కంపించిపోయిందీ భూదేవీ, కంపించిపోయిందీ గాంధి... |
| గాంధిమహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణకిందీ అధర్మము, గడగడ వణకిందీ గాంధి.... |
| గాంధిమహాత్ముడు నవ్వునవ్వగా కన్నుల గట్టిందీ స్వరాజ్యం, కన్నుల గట్టిందీ గాంధి... |
| గాంధిమహాత్ముడు గొంతువిప్పగా గణగణ మ్రోగిందీ ప్రణవము, గణగణ మ్రోగిందీ గాంధి... |
| గాంధిమహాత్ముడు స్వస్తిబాడగా కరముల దొరకిందీ మోక్షము, కరముల దొరకిందీ గాంధి... |