| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 178. స్వరాజ్యలక్ష్మి పెండ్లి |
| 178. స్వరాజ్యలక్ష్మి పెండ్లి |
| పోదాము స్వరాజ్యలక్ష్మి పెండ్లి జూడ రారే రమణులారా! |
| ముత్యాల ముగ్గులూ, రత్నాల తోరణాలు మాణిక్యాల మంటపమటా, మన లక్ష్మి పెండ్లికి పోదాము ... |
| సంద్రమె పెళ్ళిల్లంట, సదస్యులు దేవతలంట ఉప్పే తలంబ్రాలటా మన లక్ష్మి పెండ్లికి పోదాము ... |
| గాంధీ వశిష్ఠంట, కస్తురమ్మ ముత్తైదంట పరమాత్ముడే సాక్షిటా మన లక్ష్మి పెండ్లికి పోదాము ... |
| పోదాము స్వరాజ్యలక్ష్మి పెండ్లి జూడ రారే రమణులారా! |