| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 177. ఈజన్మము |
| 177. ఈజన్మము |
| ఈజన్మ మిక దుర్లభమురా, ఏ జన్మ సుకృతమో, ఈ నాడు బ్రతికుంటి మీ ... |
| ఈశ్వరుడె గాంధిగా ఇల నవతరించినాడు అందులో మముగన్న, హిందూమాతకడుపున మీ ... |
| ధర్మదేవత మూర్తి దాల్చింది గాంధిగా కళ్ళార మన మతని, గాంచి ధన్యులమైతి మీ ... |
| భారతలక్ష్మికి, భాగ్యరేఖా గాంధి అతడె మన నాయకు, డాయె నెంతటిభాగ్య మీ ... |
| ఈ శోభ గనుభాగ్య, మే నోముపంటో ఈ యజ్ఞములో చావు, యే పుణ్యఫలమో మీ ... |
| ఈజన్మ మిక దుర్లభమురా, ఏ జన్మ సుకృతమో, ఈ నాడు బ్రతికుంటి మీ ... |