| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 176. వేణునాదము |
| 176. వేణునాదము |
| వేణునాదము మోగుతుందండోయ్ ఓ భక్తులారా వేణునాదము మోగుతుందండోయ్ |
| వేగుజామూ కోడికూసె వేగుచుక్కా తూర్పున బొడిచె వేగమె నిద్దురలేచీ రండోయ్ వేళ మించిపోయేనండోయ్ వేణు ... |
| భారతదేశపు దాస్యము బాపగ పయన మాయె మోహనగాంధీ చావో జయమో తేలందే యీ జన్మకు మళ్ళీ కనబడడండోయ్ వేణు ... |
| భార్యల విడిచీ భర్తలు రండోయ్ భర్తల విడిచీ భార్యలు రండోయ్ తల్లుల విడిచీ పిల్లలు రండోయ్ పిల్లల విడిచీ తల్లులు రండోయ్ వేణు ... |
| పాపాలన్నీ పటాపంచలై పరమేశ్వరుసన్నిధిలో జన్మము ధన్యత జెందీ ముక్తిని బొందే తరుణము దొరికెను మరి రాదండోయ్ వేణు ... |
| వేణునాదము మోగుతుందండోయ్ ఓ భక్తులారా వేణునాదము మోగుతుందండోయ్ |