| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 175. బాపూజీ మాబాప్ |
| 175. బాపూజీ - మాబాప్ |
| పోర్ బందర్ కోమటింట పుట్టినాడోయ్ పురుషోత్తముడు జగతి మెట్టినాడోయ్ కొత్త యేసు క్రీస్తు అవతరించినాడోయ్ కొట్టకె పగవాళ్లపొగరు దించినాడోయ్ పోర్ బందర్ ... |
| హిందూపైగంబర్ జన్మించినాడోయ్ అల్లాహో అక్బరంటు అరిచినాడోయ్ పోర్ బందర్ ... |
| చీమను సింహాసన మెక్కించినాడోయ్ రాతి నాతి జేసిన శ్రీరాముడేనోయ్ పోర్ బందర్ ... |
| ధర్మముకై ప్రాణి పందెమొడ్డినాడోయ్ తాళలేక శత్రువులూ తలక్రిందైరోయ్ పోర్ బందర్ ... |
| చేతులు పైకెత్తి జేజే లనండోయ్ బాపూజీ ప్రపంచపు మాబాపనండోయ్ పోర్ బందర్ ... |