| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 174. మాగాంధి |
| 174. మాగాంధి |
| కొల్లాయి గట్టితే నేమీ, మాగాంధి కోమటై పుట్టితే నేమీ? కొల్లాయి ... |
| వెన్నపూసా మనసు కన్నతల్లీ ప్రేమ పండంటిమోముపై బ్రహ్మతేజస్సు కొల్లాయి ... |
| నాల్గుపరకల పిలక నాట్యమాడే పిలక నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక కొల్లాయి ... |
| బోసినోర్విప్పితే ముత్యాల తొలకరే చిఱునవ్వు నవ్వితే వరహాల వర్షమే కొల్లాయి ... |
| చకచక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికీతేను బ్రహ్మవాక్కేను కొల్లాయి ... |
| కౌశికుడు క్షత్రియుడు కాలేద బ్రహ్మఋషి నేడు కోమటిబిడ్డ కూడ బ్రహ్మర్షాయె కొల్లాయి ... |