| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 067. మానవవాంఛా నిష్ఫలత్వము |
| 67. మానవవాంఛా నిష్ఫలత్వము |
| ఆకసమ్మున చుక్క లల్లుకొనుచుండె పక్షులు వినువీధి బర్వుచునుండె సాయంతనపుగాలి చల్లగా వీచె బయటను ప్రకృతి సంపదగాంచబోదు నాటుటమాత్రమే నావంతు సుమ్ము ఫలము గాంచుట నీదు పనియె వృక్షమ్మ! మన్మథక్రీడయె మనుజకృత్యమ్ము పుత్రోద్భవం బౌట పూర్వపుణ్యంబు కాలమ్మురానిదే కలుగదు సుఖము కర్మమ్ము తొలగకే కష్టమ్ము పోదు ఆరటపడినంత యబ్బునే జయము? రమ్మన్న వచ్చునే రాత్రి సూర్యుండు? |