| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 066. నవజీవనము |
| 66. నవజీవనము |
| వాడిన పూవున కేటికి మరలను పరిమళ మొసగెదు దేవా? |
| ఎండిపోయినట్టి బావి నూటల నేటికి నూరించెదు దేవా? |
| బ్రద్దలైన సంద్రపుటల నేటికి పైకి తిరిగి పంపెదు దేవా? |
| నేలను పడుచున్న గాలిపడగను నేటి కెగురగొట్టెదు దేవా? |
| పారబోసుకొన్న ప్రణయ పాత్రము పానీయముతో నింపెదు దేవా? |
| ఆశలు వీడిన వానికి మరలను ఆశలేల గూర్చెదు దేవా? |
| ప్రాణమ్ములు చేదైన వానికిని ప్రాణము తీయగ జేసెదు దేవా? |
| అంధకార గర్భ నరక వాసికి నానంద తేజ మేటికి దేవా? |
| వాడిన పూవున కేటికి మరలను పరిమళ మొసగెదు దేవా? |