| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 065. నిరాలంబస్థితి |
| 65. నిరాలంబస్థితి |
| నట్ట నడి సంద్రాన నావలో వున్నాను నడినీటిలో ముంచుతావా? నా సామి? నావ వొడ్డట్టించుతావా? నట్టనడి... |
| చీమలూ దూరనీ చిట్టడవి లోపలా చిక్కుకున్నానోయి దేవా! యేదైన దిక్కొకటి చూపించుతావా? చీమలూ... |
| ఆదిఅంతూ లేని ఆకాశమధ్యాన అల్లాడుతున్నాను దేవా! దయవుంచి చల్లగా యిల్లుజేర్చేవా? ఆదిఅంతూ... |