| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 064. ఆశాభంగము |
| 64. ఆశాభంగము |
| పానకమ్ములో పుడక నేటి కిటు పడవేసితివో దేవా! |
| ముద్దు గులాబిని ముట్టబోవగా ముల్లు విరిగెనో దేవా! |
| తీయని పూవుం దేనె లానబో తేటి గుట్టె నోదేవా! |
| గగనమున పతం గముపై బోవగ తెగియెను దారము దేవా! |
| ప్రణయ సౌఖ్యమును పాడుజేయు నీ పంపక మేటికి దేవా! పానక... |