| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 063. దేవదత్తము |
| 63. దేవదత్తము |
| చిలుకలు కొఱికిన పం డొక్కటి నా చేతుల బడె నోదేవా తెలియు నెట్లు తీయనిదో విషమో తినకుండగ నో దేవా? |
| త్రోవ బోవుచుండ దండవీడిన పూ వొకటి దొరికె నోదేవా తావి కమ్మనిదొ తలనొప్పిడునో యేవిధి తెలియును దేవా? |
| ఱెక్కలు తెగినట్టి పిట్ట యొక్కటి అక్కున గొంటిని దేవా ఎక్కరణిని పెంచి బాగు జేసెదొ నీకే వదలితి దేవా! |