| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 062. ప్రేమప్రయాణము |
| 62. ప్రేమప్రయాణము |
| దీపముచుట్టును మిడుతవోలె నే తిరుగుచుంటి నోదేవా ఏ పగిదిని నా పాపము బాపెదొ నీయదె భారము దేవా! |
| త్రాచుబాముతో సయ్యాటల నే సల్పుచుంటి నోదేవా! కాచుటకును నీవుదక్క నెవ్వరు కల రిక దిక్కో దేవా? |
| నీటిబుగ్గపై మహాసముద్రము నీదుచుంటి నోదేవా నీట ముంచినను తేలవేసినను నీదే భారము దేవా! |
| చెలియతోడ నిశి ప్రేమప్రయాణము జేయనుంటి నోదేవా వలపుదీపికలతో మా బాటల వెలుగజేయు మోదేవా! |