| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 061. నివృతయాథార్థ్యము |
| 61. నివృతయాథార్థ్యము |
| జలబిందువులో భాస్కరు బింబము తలతల మెఱయుం గాదే దేవా? నిప్పురవ్వ యందున ప్రళయేశ్వరు నిటలాగ్ని యణగియుండదె దేవా? |
| ప్రకృతి ప్రేమమంతయు సంజప్రియుల వలపు కౌగిళుల లేదే దేవా? నిశ్చల భక్తుల హృదయపీఠముల నీ వధివసించి వెల్గవె దేవా? |