| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 060. మనస్సాక్షి |
| 60. మనస్సాక్షి |
| పడగ ముడుచుకొను పన్నగమ్మె కడు భయము గొల్పునో దేవా! కడలి శాంతముగ నున్న యప్పుడే కడుభయ మిడునో దేవా! |
| నిద్దుర దోగెడు సింగపు గురకయె నీరుజేయు దేహము దేవా! సద్దేమియు లేని నిశీథమ్మే సంతాపము హెచ్చించును దేవా! |
| మృత్యువు తలపే సంతోష లతను మోడువడగ గొట్టును దేవా! సత్యదీప్తమౌ నీ తేజమ్మున సన్నగిల్లె నా యాశలు దేవా! |