| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 130. నా జీవనదము |
| 130. నా జీవనదము |
| అకటా నా జీవనదం బిదియే మడవుల గుట్టలబడి పాఱున్? |
| ఒకచో నేనియు చల్లనినీడల సుకమగు కౌగిలి యబ్బదయ్యెగా! |
| ఆడుట గుట్టలతోనే, పాటలు బాడుట గుట్టలకొరకే, అకటా! |
| వీడెను జవసత్వములన్నియు నీ పాడుకొండ రాళ్ళపైన దొర్లన్ |
| ఇంతేనా? ఇంతేనా? సౌఖ్యం బీ జన్మకు నిక నింతేనా? |
| సుంతయైన దయ లేదా దేవా? ఎంతకాల మిటు లోపిక బట్టెద? |
| అకటా నా జీవనదం బిదియే మడవుల గుట్టలబడి పాఱున్? |