| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 161. పూలకిరీటము |
| 161. పూలకిరీటము (శాఫోగీతము) |
| పువ్వులదండల గుచ్చవె చెలియా మవ్వపు నీ కురులన్ జుట్టంగన్. |
| సల్లలితములౌ మొగ్గల సరముల నల్లవె నీ మెత్తనిచేతులతో |
| పూలకిరీటము దాల్చినవారిని పూజింతురు దేవత లని యందురు |
| పూలదండలను దాల్చనివారిని పొమ్మనందురట ప్రేమను జూడకె |
| పువ్వులదండల గుచ్చవె చెలియా మవ్వపు నీ కురులన్ జుట్టంగన్. |