| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 160. వలపులజోల |
| 160. వలపులజోల (శాఫోగీతము) |
| నిద్దుర బోవే, ఓచెలియా నీ వలపుంబ్రియు కౌగిలిలో |
| మోటకాల్వయందున జీవజల మ్ములు గుసగుసలాడుచు బోవన్ మిణుగురు పురువులు వెన్నెల నిటు నటు మిణుకు మిణుకు మని మెఱయంగన్. |
| నిద్దుర బోవే, ఓ చెలియా నీ వలపుంబ్రియు కౌగిలిలో. |
| త్రుటిసౌఖ్యమె, కట్టా, త్వరలోనే పిట్టలు లజ్జారవముల గూయున్. బాలభాస్కరుడు వనవృక్షమ్ముల పై వెలుగ నిదే వచ్చును కనుమీ. మానవసౌఖ్యమ్ముల కెల్లన్ పరి మాణము గలదు గదే ఓ చెలియా? |
| నిద్దుర బోవే, ఓ చెలియా నీ వలపుంబ్రియు కౌగిలిలో. |