| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 159. కన్నెనోము |
| 159. కన్నెనోము (శాఫోగీతము) |
| కన్నెనై యెల్లపుడు కాలమ్ము బుత్తు నీవు నాభర్తవు గావేని ప్రియుడ!] పరపురుషు డెవ్వడున్ బడయడు నన్ను ఇప్పటికేని యింకెప్పటికేని. |
| ఈ వొక్కడవె సుమ్ము యేరగాగలవు అతిసుకుమార మీ యందంపుసుమము అద్దుకు, దివ్యమౌ నగరుధూపమ్ము బలె, దీనితావి గాపాడు మెల్లపుడు |
| నీవె సుమి నాప్రేమ నెమ్మనమ్మందు జ్ఞాపకముంచుకోగలవు, రాగల్గు కాలాల మోదమ్ము, గర్వమున్, శాంతి, రాగమ్ముతో పవిత్ర మ్మొనర్పగదె! |