| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 158. ప్రణయగానము |
| 158. ప్రణయగానము (శాఫోగీతము) |
| కదలేటి రెల్లులకన్న లోలను నేను, వలపుచే నదిలోని జలమట్టు లైతి మలయ వాయువుబోలి యలమె నీపాట నన్ ప్రియుడ! చపలంపు నాహృది యెల్ల వినెడు ఇశ్శో యనిన కృంగి, ఈవు మోద మ్మంద ప్రొద్దుతిరుగుడుపూవు బోలి పొంగుదును. |