| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 157. ప్రేమతర్కము |
| 157. ప్రేమతర్కము (శాఫోగీతము) |
| చావే మేలని యంటావే దేవత లేటికి చావరురా? |
| ప్రాణమె చేదని యంటావే బ్రతుకుదు రేలను దేవతలు? |
| ప్రేమ వొట్టిదే యంటావే ప్రేమింతురేల దేవతలు? |
| ప్రేమే సర్వ మ్మంటావే, ప్రేమింపకేమి సేతుమురా? |