| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 156. ప్రేమశక్తి |
| 156. ప్రేమశక్తి (శాఫోగీతము) |
| నిశ్చలసత్యముతో జతగూర్చిన నెంతొ శక్తివంతంబౌ ప్రేమము, |
| దేవతలైనన్ దాని ధాటికిని లోబడి పోవలసినవారే |
| చపలము నికటము సుండీ ప్రేమము చంపెడు నొకమాటే, యొకమాటే. |
| కావున, జాగ్రత కాముకులారా, యేవిధి ప్రేమల మెలగెదరో! |