| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 144. ప్రేమకారణము |
| 144. ప్రేమకారణము (సెలయేటిగానము నుండి) |
| కారణం బేమనందు నో కాంత, నీదు ముద్దుమో మందమో, లేక, మోహపార వశత నిటు నటు చలియించు వాలుకనుల యందమో కెంపు పెదవులసందు నుంచి తొంగి చూచుచు వెంటనే తొలగి లోని కేగుచును మోముసీమపై నిచట నచట మెఱుపు మెఱపించు మవ్వంపు చిఱునగవుల చందమో, లేక ముంగురు లందమౌనొ! |
| ప్రేమకున్ గల్గుకారణం బేమనగల మింతిరో నిన్నుఁజూడ ప్రేమించుటె జుమి! |
| ఇంతియేగాని వేఱ్వేఱ నెంచి చూచి అందపుం దళుకులనె ప్రేమనందగలనె! తెలియు మాత్మను ఆత్మను కలిపి కుట్టు దారమే నాదు ప్రేమకు గారణమ్ము. |