| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 001. ప్రేమతత్త్వము |
| 01. ప్రేమతత్త్వము |
| ఎద మెత్త నౌటకై సొదగుందరా అంత మది గల యహమ్మంత వదలిపోవునురా! |
| వల పెఱుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలసి విఫలమ్మొంది విలపింప మేలురా! |
| చెలివలపు లేని నీ కలిమి కాల్పనె వినుము వలపు దీగెను జీవ ఫలము కాయునురా! |
| ప్రేమకన్నను యెక్కు వేముందిరా యెల్ల కామ్య పదవులకన్న ప్రేమ యెక్కువరా! |
| ప్రేమించు సుఖముకై ప్రేమించు ముక్తికై ప్రేమించు ప్రేమకై యేమింక వలయురా! |