| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 033. ప్రోషిత |
| 33. ప్రోషిత |
| ఎవరు సంతోషింప నీ యలంకారంబు? ఎవరు గని మెచ్చుకొన నీ సొమ్ములెల్ల? ప్రవిమలాత్మక! దేవ! ప్రాణేశ! నీవుగా కెవరు... |
| నిదుర బట్టక రేల నీ మనోహరరూప మెద నిల్పి నా జీవితేశ్వరుడ వీవె యని పదిలముగ నిన్ను నే బట్టుకొని కౌగిలిడి మదిపొంగి కనువిప్ప మాయమైపోతి విం కెవరు... |
| బాల సూర్యుని కాంతి గేలి సేయగజాలు ఫాలమున తేజస్సు ప్రభవిల్లుచుండగా లీల లొప్పెడుమూర్తి దాల్చి నాదగు మనో లోలత్వమున్ బాప జాలిగొని రావైతి |
| వెవరు సంతోషింప నీ యలంకారంబు? ఎవరు గని మెచ్చుకొన నీ సొమ్ములెల్ల? ప్రవిమలాత్మక! దేవ! ప్రాణేశ! నీవుగా కెవరు సంతోషింప నీ యలంకారంబు? |