| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 032. విరహిణి |
| 32. విరహిణి |
| దీప కళికలు విన్ననై తెల్లబారె పాన్పుపై నిడ్డపూవులు వాడిపోయె పిట్టలన్నియు తమ గూళ్ళ వీడి పరచు స్వామి, నీ దాసికడ కింక వచ్చుటేమి? |
| కనులు మూతలుపడి నిద్ర గమ్ముచుండె బడలికంజేసి అవశత నొడలు తూలు పరవశగజూచి నాసిగ్గుతెరను జీల్చి చోరువలె పట్టుపడకుండ పారిపోవు |
| నప్పుడైనను దయయుంచి యంతరంగ మందు నా ప్రేమ మన్నించి, మరచిపోక లేపి, నీ ముద్దు మోమును జూపి వేగ నా మనోలోలతను బాపునాథ! దేవ! |