| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 164. ప్రియనిరీక్షణము |
| 164. ప్రియనిరీక్షణము (శాఫోగీతము) |
| గున్నమావి కొమ్మలందు గువ్వలు గుసగుసలాడుచు నుండెన్ |
| వాడిన యాకులు నిదుర జరించెడి వాడల నాడుచునుండెన్. |
| ఇవ్వని మాడ్చెడు మధ్యాహ్న మెల్ల నిట్లె కాచుకొనియుంటిన్. |
| సంజను గబగబ వచ్చు నీ యడుగు చప్పుడు వినబడునా యంచున్. |