| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 165. ప్రియనిరీక్షణము |
| 165. ప్రియనిరీక్షణము (శాఫోగీతము) |
| గడియనక జామనక కాచి కూర్చుండి నిశ్శబ్దమగుద్వార మీక్షించుచుందు నీడలు గోడపై నాడుచుంబోవు వీధి నడుగులసడి వినవచ్చుచుండె ఆశయు సంశయ మ్మలమి నాదైన యాలోలహృదయమ్ము నాడించుచుండె ఎందరో యిండ్లకై యేగుదెంచెదరు కాని నీవింక దూరానె యుంటివిగా. |