| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 166. ప్రియనిరీక్షణము |
| 166. ప్రియనిరీక్షణము (శాఫోగీతము) |
| వాడిన గులాబియాకు లన్నియున్ పడిపోయెను సోననీటిలోనన్ |
| కమ్మని పిల్లంగ్రోవులపాటలు ఉమ్మరించు నిశ్శబ్దము జీల్చున్ |
| కాని నే నిటులె వీనుల నొగ్గుచు కాచియుండ నెంతో యాత్రముతో |
| అల్లదె వాకిలి మెట్లపైన నీ యడుగుల చప్పుడు వినిపించెన్. |