| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 104. సౌఖ్యమే లేదా? |
| 104. సౌఖ్యమే లేదా? |
| సౌఖ్యమే లేదా లోకమున సౌఖ్యమే లేదా? |
| కమలలోచనల కౌగిళులందున సౌఖ్యమే.... |
| ముద్దుబిడ్డల మురిపెపుమాటల సౌఖ్యమే.... |
| తల్లిదండ్రులను తగ కొలుచుటలో సౌఖ్యమే.... |
| బీదసాదలను ప్రేమ జూచుటలో సౌఖ్యమే.... |
| చెలులకు సాయపు చే యిచ్చుటలో సౌఖ్యమే.... |
| భగవంతుని మది భక్తి గొలుచుటలో సౌఖ్యమే.... |