| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 105. విహారము |
| 105. విహారము |
| కొండకోనల నదుల వనముల నెండచొరని నికుంజ గృహముల పండువౌ నెమ్మదికి నీతో పడతి! తిఱుగాడన్. |
| మండజేసెడు మండువేసవి యెండసైతము నీవు నాదగు దండ నుండగ సుకమునిచ్చును పండు వెన్నెలటుల్. |
| పండు ఫలములు పూవు దేనెలు నిండు నమృతము రుచులతోడను నిండువలపున బ్రకృతిసుందరి తాండవము సల్పున్. |
| గండుకోయిల పాట విని కం తుండు ప్రేమోత్సాహ రభసత తాండవింపగ పొంగి నాయెద తప్పటలు జరచున్. |