| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 003. తాజ్ మహల్ |
| 03. తాజ్మహల్ |
| మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీ లతొకటీ యేమా రెండింటి ప్రేమసంపదా యింతింతనలేమూ |
| చూడలేక పాపిష్టి తుపానూ ఊడబీకె లతనూ మోడయిపోయీ మామిడిచెట్టూ మొగము వేలవేసీ |
| ముచ్చటైన ఆకులు కాయలనే వెచ్చని కన్నీళ్ళోడ్చీ పచ్చనాకులా బొమ్మరింటిలో పండొక్కటి రాల్చీ |
| మామిడిచెట్టూ మాధవిలతతో మాయలో గలసింది కామితమిచ్చే మామిడిపండూ కవులకు మిగిలింది! |