| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | దోసపళ్ళు |

| దోసపళ్ళు |
త్రోవలో ఒకరాజు తోటేసినాడు తోటలోపల పండ్లు దొర్లుతున్నావి. దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని, ఆ పండ్లు పంపాడు ఆరగించంగ. తింటేను తియదోస పండ్లే తినాలి, కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి. కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి. అందితే అన్నతో వియ్యమందాలి. అందితే అన్నతో వియ్యమందాలి, ఆడితే వదినతో జగడమాడాలి. |