| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | కన్నబిడ్డలు |

| కన్నబిడ్డలు |
కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు? కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు? కన్నకానుపులెల్ల కడుచక్కనయితె, కన్నుల్ల పండుగే కన్నతల్లికిని. |
| * * * |
లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము? కొడుకులను గంటేను కోటి లాభమ్ము. గోరంతదీపమ్ము కొండలకు వెలుగు, గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు. మాడంతదీపమ్ము మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు. |
| * * * |
వీథిలో ఉయ్యాల అమ్మవచ్చింది, కొడుకులను గన్నతల్లి కొనవె ఉయ్యాల. |
