| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | కలువరేకుల కళ్ళు |

| కలువరేకుల కళ్ళు |
పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు, అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు. కలువరేకులవంటి నీ కన్నులకును, కాటుకలుపెట్టితే నీకు అందమ్ము. ఏడువకు ఏడువకు వెఱ్ఱిఅబ్బాయి, ఏడుస్తె నీకళ్ళు నీలాలు కారు. నీలాలు కారితే నే జూడలేను, పాలైన కారవే బంగారు కళ్ల. |