| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | గోరుముద్ద; గుజ్జుముద్ద |


| గోరుముద్ద; గుజ్జుముద్ద |
పసిబిడ్డలకు చిట్టిపిడతలతో అన్నము మెత్తగా వండుదురు. ఆ మెత్త నన్నమును కంచంలోగాని, గిన్నెలోగాని కలిపి గోరుముద్దలని, గుజ్జుముద్దలని పేర్లు చెప్పుతూ తినిపిస్తారు. బొటనవేలి గోరు మీదికి కొంచెముగా తీసుకొని పెట్టేదాని పేరు గోరుముద్ద. కలిపేటప్పుడు మెత్తనచేత చేతికంటితే కంచము అంచునగాని, గిన్నె అంచునగాని గీచి ఎత్తిపెట్టేదాని పేరు గుజ్జుముద్ద. పసిబిడ్డలు గోరుముద్దలన్నా, గుజ్జుముద్దలన్నా అల్లరిమాని ఆరగిస్తారు. గోరుముద్దకంటే గుజ్జుముద్ద ఎక్కువ రుచిగలది. |